గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ నుండి టిడిపిలోకి వలసలు కొనసాగుతున్నాయి.ఆదివారం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో బేస్తవారిపేట పట్టణానికి చెందిన సత్యేలి కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో 70 కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సత్యేలి రంగయ్య, సత్యేలి కాశీ, చెక్కా సరస్వతీ, వీణా, బాదం కృష్ణ, మరియు మండల పార్టీ అధ్యక్షులు సొరెడ్డి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుంటక నరసింహ యాదవ్, ఎంపీటీసీ సభ్యులు పూనూరు భూపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దూదేకుల సైదులు, క్లస్టర్ ఇంచార్జ్ ముప్పూరి రామయ్య, యువకులు భారీ సంఖ్యలో పాల్గోన్నారు.
Recent Posts